జెర్సీ మూవీ రీమేక్ కి రంగం సిద్ధం....!

by సూర్య | Mon, Oct 14, 2019, 02:33 PM

నాని హీరోగా ఈ ఏడాది వేసవి కానుకగా విడుదలైన ఎమోషనల్ ఎంటర్టైనర్ జెర్సీ మూవీ హిందీ రీమేక్ కి రంగం సిద్ధమైంది .ఎప్పటినుండో జెర్సీ మూవీ హిందీలో రీమేక్ కానుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నేడు దీనిపై స్పష్టత వచ్చింది. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ బడా నిర్మాతలైన అల్లు అరవింద్,దిల్ రాజు నిర్మించడం విశేషం. వీరిద్దరితో పాటు ఆమన్ గిల్ నిర్మాణంలో భాగస్వామం తీసుకున్నారు. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ కి కూడా దర్శకత్వం చేయనున్నారు. త్వరలో సెట్స్ పైకెళ్ళ ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానుంది. సందీప్ రెడ్డి తెరకెక్కించిన తెలుగు సూపర్ హిట్ మూవీ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న షాహిద్ మరో తెలుగు మూవీ రీమేక్ లో నటించడం విశేషం. గతంలోనే ఈయన జెర్సీ మూవీ హిందీ రీమేక్ లో నటించనున్నారని వార్తలు వచ్చాయి, నేటితో దీనిపై స్పష్టత ఏర్పడింది. ఐతే ఈ మూవీ నిర్మాతగా కరణ్ జోహార్ ఉంటారని వార్తల నేపథ్యంలో కొత్తగా టాలీవుడ్ నిర్మాతలైన అల్లు అరవింద్, దిల్ రాజు వచ్చి చేరడం ఆశ్చర్యానికి గురిచేసింది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM