'రాజు గారి గది ' టైటిల్ సాంగ్ రిలీజ్...!

by సూర్య | Mon, Oct 14, 2019, 02:04 PM

యాంకర్ నుండి తన కష్టంతో డైరెక్టర్ గా మారాడు ఓంకార్. అతను ఇప్పటివరకు తెలుగులో 3 సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు నాల్గవ సినిమా 'రాజుగారి గది 3' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పక్కా మాస్ బీట్స్ తో ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ ప్రత్యేకంగా మాస్ ప్రేక్షకుల కోసం అని చెప్పక్కర్లేదు. అతను చేసిన నాలుగు సినిమాలలో 'జీనియస్' మూవీ తప్ప అన్ని సినిమాలు హర్రర్ సినిమాలే. ఓంకార్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా 'జీనియస్'. ఆ సినిమాలో 'డిబిరి డిబిరి' అనే ఐటెం సాంగ్ అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. మళ్ళీ ఆ రేంజ్ లో ఇప్పుడు విడుదల చేసిన లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. 'నా గది లోకి రా' అంటూ సాగే ఈ పాట మాస్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపడం ఖాయం. ఇదివరకు ఐటెం సాంగ్ అంటే సిల్క్ స్మిత లాంటి వాళ్ళు చేసేవారు. కానీ ఇప్పుడు ఐటెం సాంగ్ లు అన్నీ మన స్టార్ హీరోయిన్స్ చేసేస్తున్నారు. ఆ ఐటెం సాంగ్స్ లో హీరోయిన్లను చూస్తున్న జనాలకు అది ఐటెం సాంగ్ లా అనిపించట్లేదు. అది కూడా రొటీన్ సాంగ్ లానే చూస్తున్నారు. ఇప్పుడు ఒక మంచి ఐటెం సాంగ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ టైములో ఓంకార్ విడుదల చేసిన లిరికల్ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కాలంలో 'రంగమ్మ మంగమ్మ' పాటతో ఆకట్టుకున్న మానసి ఈ పాట పాడింది. ఆమెకు జత కలిసాడు స్టార్ సింగర్ రేవంత్. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి చేశారు. ఆయన కొరియోగ్రఫి అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన కొరియోగ్రఫి చేసిన మాస్ పాటలు ఆ సినిమాలలోనే పెద్ద హిట్ అయ్యాయి. ఈ పాటలో ఆలీ ధనరాజ్ లాంటి కమెడియన్స్ కూడా కనిపిస్తున్నారు.

Latest News
 
బాలీవుడ్‌కి వెళ్తే అన్నీ వదిలేయాలి: త్రిష Fri, Mar 29, 2024, 10:34 AM
విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ డీటైల్స్ ఇవే! Fri, Mar 29, 2024, 10:15 AM
'నువ్వు నువ్వు నువ్వే నువ్వు' సాంగ్ లిరిక్స్ Fri, Mar 29, 2024, 08:54 AM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM