తన సక్సెస్‌ను సెలెబ్రెట్ చేసుకున్న పునర్నవి...!

by సూర్య | Mon, Oct 14, 2019, 01:16 PM

పునర్నవి భూపాలం.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజ్ తరుణ్, అవికాగోర్ హీరో హీరోయిన్స్‌గా చేశారు. ఆ తర్వాత పునర్నవి.., శర్వానంద్ హీరోగా వచ్చిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాలో హీరో కూతురుగా నటించింది. ఆ మద్య ‘పిట్టగోడ’ అనే సినిమాలో హీరోయిన్‌గా కూడ యాక్ట్ చేసి తెలుగు ప్రేక్షకుల మెప్పుపొందింది. తాజాగా బిగ్ బాస్ 3లో ఓ కంటెస్టెంట్‌‌గా పాల్గొన్న విషయం తెలిసిందే. హౌజ్‌లో ఉన్నంత కాలం లేడీ మోనార్క్‌గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. మరో ఇంటి సభ్యుడు రాహుల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ.. బిగ్ బాస్ హౌజ్ ప్రేమ పావురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అది అలా ఉంటే మూడు వారాల ముందే హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన పునర్నవి తన సక్సెస్‌ను సెలెబ్రెట్ చేసుకుంటోంది.  బిగ్ బాస్‌ రియాలిటీ షోలో పాల్గొన్నందుకు, విజయవంతంగా రెండు నెలలు కంప్లీట్ చేసినందుకు తన తమ్ముడు, ఫ్రెండ్స్‌తో సెలెబ్రేట్ చేసుకుంటోంది పున్ను. దానికి సంబందించిన కొన్ని పిక్స్‌‌ను.. తన సోషల్ మీడియా అకౌంట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా పునర్నవి ప్రస్తుతం 'సైకిల్', 'చిన్న విరామం' సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు పున్నుకు అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌ సందీప్ వంగా దర్శకత్వంలో ఓ అవకాశం కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM