సైరా దెబ్బ‌తో మిల్కీబ్యూటీ ముంగిట‌ అవ‌కాశాలు వాలుతున్నాయ‌ట‌

by సూర్య | Sun, Oct 13, 2019, 11:00 PM

  ‘ఎఫ్ 2’, సైరా విజ‌యాల‌తో మరోమారు రేంజ్ పెంచేసుకున్న త‌మ‌న్నాకు  తెలుగు .. తమిళ భాషల్లో  వ‌రుస అవ‌కాశాలందుకుంటోంద‌ట‌. బాలీవుడ్లోను తన జోరు చూపించడానికి ప్రయత్నించిన ఆమెకు   కుదరలేదు స‌రిక‌దా తెలుగు .. తమిళ భాషల్లోను కొత్త కథనాయికల పోటీ కారణంగా ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు సైరాలో ఆమెకి అవకాశం రావడం, నయనతార పాత్రకంటే తన‌ పాత్ర ఎక్కువ ప్రభావం చూపడంతో పాటు ప్రమోషన్స్ లో నయనతార ఎక్కడా కనిపించకపోగా,  చురుకుగా పాల్గొనడం  కూడా తమన్నా కు క‌ల‌సి వ‌చ్చింది.  అందునా చిత్ర విజ‌యంలో ప్ర‌ధాన భూమిక త‌మ‌న్నాదే అంటూ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రశంసల కారణంగా తమన్నాకి మళ్లీ వరుస అవకాశాలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సీనియర్ స్టార్ హీరోల సరసన ఆమెను ఎంపిక చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నట్టుగా  ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల భోగ‌ట్టా.

 

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM