బైరెడ్డికి ఓ రోజు పెళ్లంగానైనా ర‌డీ అంటున్న శ్రీ‌రెడ్డి

by సూర్య | Sun, Oct 13, 2019, 10:46 PM

నిత్యం వివాదాల‌లో క‌నిపించే శ్రీరెడ్డికి పెళ్లి మీద ధ్యాస మ‌ళ్లిన‌ట్టే ఉంది. దానికి కూడా కాసింత వివాదాన్ని త‌గిలించి  వరుస పోస్ట్‌లు పెడుతోంది. ‘నేను తొలిసారిగా నా పెళ్లి గురించి పోస్ట్ పెడుతున్నా.. బైరెడ్డి సిద్దార్ధ రెడ్డికి కనీసం ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటే చాలు.. ఆ తరువాత చనిపోయినా పర్లేదు.. నువ్ మగాడివిరా బుజ్జీ’ అంటూ ఆ యువనాయుడ్ని మొగుడుగా కావాలంటోంది శ్రీరెడ్డి. ఇంత‌కీ ఈ సిద్ధార్ధ రెడ్డి ఎవ‌రంటే  రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కొడుకే ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మంచి వాక్చాతుర్యంతో పాటు యూత్‌లో మాస్ లీడర్‌గా పేరొందారు. కర్నూల్ రాజకీయాల్లో ఈ యువనేత ఇప్పుడో సంచలనం అనే చెప్పాలి. కర్నూల్ జిల్లా నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌‌గా ఉన్న ఈ యువనేత గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఆర్థర్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
 సిద్ధార్ధ‌లో శ్రీ‌రెడ్డికి ఏం నచ్చిందో తెలియదు కాని.. బైరెడ్డిపై మ‌న‌సు పారేసుకుంది. అసలే మనోడికి ఆవేశం ఎక్కువ.. పైగా సోషల్ మీడియాలో కూడా శ్రీరెడ్డి మాదిరే బాగా యాక్టివ్ కూడానూ.. మరి తనపై మనసు పారేసుకున్న శ్రీరెడ్డి పోస్ట్‌లపై బైరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.


 


 

Latest News
 
ఫరియా అబ్దుల్లా కాలుపై ఉన్న టాటూ అర్ధం ఏంటో తెలుసా? Tue, Apr 23, 2024, 10:37 AM
36 గంటల పాటు అభిమాని శ్రమ...10 వేల పదాలతో దళపతి విజయ్‌పై కవిత Mon, Apr 22, 2024, 10:51 PM
ఈ సారి ‘కూలీ'గా రాబోతున్న రజనీకాంత్‌ Mon, Apr 22, 2024, 09:10 PM
20 భాషలలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'కంగువ' Mon, Apr 22, 2024, 08:45 PM
'మిరాయి' చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Apr 22, 2024, 08:43 PM