చిరు 153వ సినిమాను డైరెక్టర్ గా సుకుమార్?

by సూర్య | Sun, Oct 13, 2019, 08:08 PM

చిరంజీవిని డైరెక్ట్ చేయాలని ప్రతి దర్శకుడికి ఉంటుంది. కానీ ఆ అవకాశం కొంతమందికే దక్కుతుంటుంది. ఇటీవల ఆ అవకాశాన్ని ‘సైరా’తో సురేందర్ రెడ్డి దక్కించుకుని సద్వినియోగం చేసుకున్నాడు. సురేందర్ రెడ్డికి ఇంత పెద్ద సినిమా ఇవ్వడం వెనుక కీ రోల్ ప్లే చేసింది రామ్ చరణే. తనకు ‘ధృవ’తో విజయాన్నిచ్చిన సురేందర్ రెడ్డిని చరణ్ ఎంతగానో నమ్మి ఈ ప్రాజెక్ట్ అప్పజెప్పాడు. ఇక వరుసగా హిట్లు కొడుతూ వస్తున్న కొరటాల శివపై చిరుకి మొదటి నుండి గట్టి నమ్మకముంది. అందుకే తన 152వ సినిమా అవకాశాన్ని అతనికే ఇచ్చాడు. ఇక తాజాగా చరణ్ మలయాళ హిట్ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్ హక్కుల్ని కొన్నాడు. ఈ పొలిటికల్ డ్రామా కోసం కూడా చరణ్, చిరులు ఇకర్ని ఎంపిక చేసుకున్నారట. అతనే సుకుమార్. ఈ లెక్కల మాస్టారు రామ్ చరణ్ కు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్, రూ.100 కోట్ల షేర్ రికార్డ్ నెలకొల్పిన ‘రంగస్థలం’ను అందించాడు. చిరు సైతం సుకుమార్ పనితనానికి ఫిదా అయ్యారు. అందుకే 153వ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఆయనకేనాని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి ఈ వార్తలపై మెగా కాంపౌండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Latest News
 
'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, Apr 25, 2024, 03:27 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Apr 25, 2024, 03:25 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Thu, Apr 25, 2024, 03:21 PM
'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ సింగల్ రిలీజ్ అప్పుడేనా? Thu, Apr 25, 2024, 03:18 PM
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న 'కృష్ణమ్మ' టీమ్ Thu, Apr 25, 2024, 03:13 PM