100 కోట్ల మార్కును చేరిన ‘సైరా’... !

by సూర్య | Sun, Oct 13, 2019, 07:58 PM

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి వసూళ్లను రాబడుతోంది. ఈరోజుతో వసూళ్లు రూ.100 కోట్ల మార్కును చేరనున్నాయి. ఇక ఓవర్సీస్లో సైతం దాదాపు ఇదే దూకుడు కనబడుతోంది. నిన్న శనివారంతో యూఎస్ కలెక్షన్స్ 2,448,312 డాలర్లకు చేరుకున్నాయి. ఈ మొత్తం చిరు ఆల్ టైమ్ బెస్ట్ ‘ఖైదీ నెం 150’ వసూళ్లు 2,447,043 డాలర్ల కంటే ఎక్కువ. ఈ మొత్తంతో చిత్రం ఆల్ టైమ్ టాప్ 10 జాబితాలోకి చేరింది. ఫుల్ రన్ ముగిసేసరికి జాబితాలోని కొన్ని సినిమాల్ని ‘సైరా’ అధిగమించవచ్చు. జాబితాలో టాప్ 2గా ‘బాహుబలి2, బాహుబలి 1’ ఉండగా 2.44 మిలియన్ డాలర్లతో 9వ స్థానంలో ‘అ..ఆ’, 2.46 మిలియన్ డాలర్లతో 8వ స్థానంలో ‘గీతా గోవిందం’, 2.54 మిలియన్ డాలర్లతో ‘మహానటి’ 7వ స్థానం, 2.90 మిలియన్ డాలర్లతో ‘శ్రీమంతుడు’ 6వ స్థానం, 3.2 మిలియన్ డాలర్లతో ‘సాహో’ 5వ స్థానం, 3.4 మిలియన్ డాలర్లతో ‘భరత్ అనే నేను’ 4వ స్థానం, 3.5 మిలియన్ డాలర్లతో ‘రంగస్థలం’ 3వ స్థానంలో ఉన్నాయి. వీటిలో ఎన్ని చిత్రాల్ని మెగాస్టార్ చిత్రం అధిగమిస్తుందో చూడాలి.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM