ఆ సినిమా నుంచి తమన్నా అందుకే తప్పుకుందా....!

by సూర్య | Sun, Oct 13, 2019, 07:35 PM

స్టార్ హీరోయిన్ స్టాటస్ లో ఉండీ ఒక కొత్త హీరో సరసన అంగీకరించాలంటే దానికి చాలానే లెక్కలు ఉంటాయి. లాజిక్ లు వర్కువుట్ కావాల్సి ఉంటుంది. పారితోషికాలు వగైరా వగైరా ఇలాంటి వాటిని డిసైడ్ చేస్తుంటాయి. అయితే ఇలాంటి కారణమే `రాజుగారి గది 3` నుంచి మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా తప్పుకోవడానికి కారణమని ప్రచారమైంది. కాజల్ .. తమన్నా లాంటి స్టార్లు అంగీకరించి ఆ తర్వాత వదులుకున్న ప్రాజెక్టుగా రాజుగారి గది 3 పాపులరైంది. కొత్త హీరో అశ్విన్ సరసన నటించడం ఇష్టం లేకే తమన్నా ప్రారంభోత్సవంలో పాల్గొని వదిలేసిందని చెప్పుకున్నారు. అయితే అది నిజమా? అంటే కానేకాదని ఈ యంగ్ హీరో అంటున్నారు. హీరో అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ.. ``తమన్నాను తప్పించనూ లేదు. తాను తప్పుకోనూ లేదు. కాల్షీట్ల సమస్య వల్ల తప్పుకుంది!`` అని తెలివైన ఆన్సర్ ఇచ్చాడు. మిల్కీ స్థానంలో వచ్చిన అవికా అద్భుతంగా నటించిందని కితాబిచ్చాడు. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 18న సినిమా విడుదలవుతోంది. సినిమా హిట్టయితే తమన్నా నిర్ణయం రాంగ్ అయినట్టు.. ఫ్లాపైతే కరెక్టేనని మాట్లాడుకుంటారంతా. అసలింతకీ తమన్నా ఎందుకు తప్పుకుంది? అన్నది తనే చెప్పాల్సి ఉంటుంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM