జబర్ధస్త్ జడ్జ్‌గా రోజా రెమ్యూనరేషన్ ఎంతంటే...?

by సూర్య | Sun, Oct 13, 2019, 06:51 PM

సినిమాల్లో హీరోయిన్‌గా పీక్  స్టేజ్‌లో ఉండగానే రోజా సినిమాల నుంచి రాజకీయాల వైపు తన అడుగులు వేసింది. అందులో భాగంగా రోజా తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయింది.  ఆ తర్వాత వైయస్ఆర్‌సీపీలో జాయిన్ అయింది. గత ఎన్నికల్లో నగరి నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టింది.ఒకవైపు రాజకీయాల్లోకి ఉంటూనే మరోవైపు సినిమాలు, జబర్థస్త్ వంటి కామెడీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. జబర్ధస్త్ షోలో ఒక్కో ఎపిసోడ్‌‌కు రోజా రూ.1.5 లక్షల తీసుకొనేది. కానీ రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత  నుంచి రూ.2 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం. ఒక ఏపీఐఐసీ ఛైర్మన్‌గా రోజాకు నెలకు రూ.3.82 లక్షల జీతభత్యాలు అందుకుంటోంది. రూ.2 లక్షలు జీతంగా ప్రభుత్వం నిర్ణయించింది. వాహన సౌకర్యానికి రూ. 60,000 వేలు..కేటాయించింది. అధికార క్వార్టర్స్ లో నివాసం లేని యెడల వసతి సౌకర్యానికి రూ. 50,000 వేలు కూడా మంజూరు చేసింది. మొబైల్ ఫోన్ చార్జీలకు రూ. 2,000 వేలు, వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాలు చెల్లించేందుకు 70,000 వేలు కేటాయించింది సర్కార్. ఇక ఎమ్మెల్యేగా వచ్చే జీతం అదనం. ఈ రకంగా రోజా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు రెండు చేతులు కాదు నాలుగు చేతులు బాగనే సంపాదించుకుంటుంది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM