రికార్డ్ సృష్టించిన బిగిల్ ట్రైలర్‌...!

by సూర్య | Sun, Oct 13, 2019, 03:39 PM

కోలీవుడ్‌ టాప్‌ హీరో, దళపతి విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం బిగిల్‌. విజయ్‌ డ్యూయల్‌ రోల్ చేస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ వ్యూస్‌ సాధించి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. బిగిల్ ట్రైలర్‌ను పది నిమిషాల్లోనే 20 లక్షల మంది వీక్షించగా, మొదటి గంటలో దాదాపు 6 మిలియన్‌ (60 లక్షల)కు పైగా వీక్షించారు. సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్‌ అయిన ఈ ట్రైలర్‌ను రెండు గంటల 45 నిమిషాల్లోనే కోటి మందికి పైగా వీక్షించటం విశేషం. అంతేకాదు కేవలం ఒక్క గంటలోనే ఈ ట్రైలర్‌ పది లక్షలకు పైగా లైకు సాధించి మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. కేవలం రిలీజ్‌ అయిన 12 గంటల్లోనే 13 మిలియన్‌ (కోటీ 30 లక్షలు)లకు పైగా వ్యూస్‌ సాధించిన బిగిల్‌ సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పింది. కళ్లుచెదిరే యాక్షన్‌ సీన్స్‌తో రూపొందించిన బిగిల్‌ ట్రైలర్‌లో సినిమాలోని విజయ్‌ డిఫరెంట్‌ లుక్స్‌ను రివీల్‌ చేశారు. బాలీవుడ్ స్టార్స్‌ సైతం బిగిల్ ట్రైలర్‌ సూపర్బ్ అంటూ కితాబిస్తున్నారు. బాద్‌ షా షారూఖ్‌ ఖాన్‌, దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌లు బిగిల్‌ ట్రైలర్‌ను తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు ట్రేడ్ ఎనలిస్ట్‌లు సైతం ఈ ట్రైలర్‌పై స్పందించారు. 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM