ప్రముఖ కొరియో గ్రాఫర్ కన్నుమూత

by సూర్య | Sun, Oct 13, 2019, 02:11 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్ శ్రీను మాస్టర్ (82) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చైన్నైలోని నివాసంలో ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. సాయంత్రం చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. శ్రీను మాస్టర్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. కొడుకు విజయ్ శ్రీనివాస్ దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. 1969లో నిర్మాత డూండి నిర్మించిన నేనెంటే నేనే చిత్రంతో డాన్స్ మాస్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత మహాబలుడు, భక్త కన్నప్ప, దొరబాబు, ఎదురులేని మనిషి, యుగ పురుషుడు చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. 8 భాషల్లోని ఆయన కొరియో గ్రాఫర్ గా పనిచేసి 1700 చిత్రాలకు పైగా డాన్స్ సమకుర్చాడు. స్వర్ణ కమలం, రాధా గోపాలం, శ్రీరామ రాజ్యం చిత్రాలకు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నంది అవార్డు పొందారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM