రాజమౌళికి బాబు శుభాకాంక్షలు

by సూర్య | Sun, Oct 13, 2019, 07:29 AM

సృజనాత్మక కళాఖండాల రూపకర్త, దర్శకధీరుడు రాజమౌళికి బర్త్ డే విషెస్ చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తెలుగు సినిమా గర్వించదగ్గ గొప్ప దర్శకుడు రాజమౌళి అని ప్రశంసించారు. అలాంటి గొప్పదర్శకుడికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అందించాలని కోరుకున్నారు. రాజమౌళి జన్మదినం సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దర్శకుడు రాజమౌళికి మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు లోకేష్ విషెస్ తెలియ‌చేశారు. తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లారంటూ కొనియాడారు. తెలుగు చలనచిత్ర పరిధిని విస్తృతం చేశారని ప్రశంసించారు. ఆత్మీయులు రాజమౌళికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తాను రాజమౌళి అభిమానినని లోకేష్ తెలిపారు. రాజమౌళి మరెన్నో ఉత్తమ చిత్రాలను తీయాలని సగటు అభిమానిగా కోరుకుంటున్నానన్నారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM