అమెరికాలో బెల్లంకొండ గణేశ్ సినిమా?

by సూర్య | Sun, Oct 13, 2019, 01:17 AM

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ గణేశ్ (బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైన సంగతి విదితమే. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్ ను అమెరికాలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాకు 15-25 ఏళ్ల మధ్య వయసున్న నటీనటులు కావాలని యూనిట్ ప్రకటించింది. నటనపై ఆసక్తి ఉన్న వారు వారి పోర్ట్‌ఫోలియోలను castingcallp10@gmail.comకు పంపించాలని కోరింది.  అలాగే అమెరికాలో నివసిస్తున్న టాలెంట్ కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. జనవరిలో ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరగనున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న తెలుగు వారు కూడా ఆడిషన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.


 


 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM