నిశ్చితార్థ వేడుకలో కలిసిన చిరంజీవి, బాలకృష్ణ!!

by సూర్య | Sat, Oct 12, 2019, 10:53 PM

టాలీవుడ్ దిగ్గజాలు చిరంజీవి, బాలకృష్ణలు మరోసారి కలిశారు. దివంగత సినీ దర్శకుడు కోడి రామకృష్ణ రెండో కుమార్తె ప్రవల్లిక వివాహ నిశ్చితార్థం సీహెచ్ మహేశ్ తో వైభవంగా సాగగా, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి, బాలయ్యలు పక్కపక్కనే కూర్చుని చాలా సేపు ముచ్చటించుకున్నారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్, నిర్మాత అల్లు అరవింద్, సీనియర్ నటుడు మురళీ మోహన్ లతో పాటు పరుచూరి గోపాలకృష్ణ, రాఘవేంద్రరావు, రాజశేఖర్, జీవిత దంపతులు, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. పలువురు సినీ ప్రముఖులు కాబోయే వధూవరులకు శుభాభినందనలు తెలిపారు.


 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM