బాల‌య్య‌-బోయ‌పాటి సినిమాలో ప్ర‌తినాయిక‌గా రోజా?

by సూర్య | Sat, Oct 12, 2019, 01:35 AM

రెండు దశాబ్దాల క్రితం బాలయ్య,రోజా కాంబినేషన్‌లో చిత్రమంటే ప్రేక్షకులకు కన్నుల పండుగే. అంతగా రోజా,బాలయ్య జంట వెండితెరపై అలరించింది. ఇప్పుడు ఇద్ద‌రూ రాజకీయాల్లో వేర్వేరు పార్టీల‌లో ఉన్న‌ప్ప‌టికీ  ఒకరిపై ఒకరు విమర్శలు   చేసుకున్న సంద‌ర్భం లేదు. 


ఈ జంట మ‌రోమారు తెర‌పై క‌నిపిస్తే.... ఆ సినిమా హిట్టేన‌ని ఊహించిన  దర్శకుడు బోయపాటి  బాలయ్య కాంబినేష‌న్‌లో తీస్తున్న చిత్రంలో ఓ పాత్ర కోసం రోజాని ఒప్పించే ప‌నిలో ఉన్నాడ‌ట‌. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నెగిటివ్  అత్యంత కీల‌కంగా ఉంటుందని విరామం  చిహ్న స‌మ‌యంలో   ప్రవేశించి  ద్వితీయ భాగం అంతటా క‌నిపించేలా ప్ర‌త్యేక త‌ర‌హాలో ఈ పాత్ర‌ని రూపొందించాడ‌ట బోయ‌పాటి. బాల‌య్య‌కు క‌థ వినిపించిన‌ప్పుడే రోజా అయితే ఈ క్యారేక్ట‌ర్‌కి స‌రైన న్యాయం జ‌రుగుతుంద‌ని ఇద్ద‌రూ అనుకున్నార‌ని, ఈ నేప‌థ్యంలోనే ఇప్ప‌టికే ప‌లు ప‌ర్యాయాలు మ‌ణికొండ‌లోని రోజా ఇంటిని శీన‌య్య తెగ తొక్కేస్తున్నాడ‌ట‌.  మ‌రి ఎంత‌వ‌ర‌కు స‌క్స‌స్ అవుతాడో చూడాలి.


 


 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM