బాలయ్య కొత్త సినిమా టైటిల్ పై క్యూరియస్

by సూర్య | Fri, Oct 11, 2019, 12:50 PM

బాలకృష్ణ, కె.యస్.రవికుమార్ కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హ్యాపీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సోనాల్ చౌహాన్, వేదిక ఇందులో కథానాయికలు. సీనియర్ నటి భూమిక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ నెల 18 నుంచి కొత్త షెడ్యూల్ ను ప్రారంభించి.. సంపూర్ణంగా చిత్రీకరణను పూర్తి చేస్తారు. డిసెంబర్ 20 న సినిమాని రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ మూవీకి ఇంకా టైటిల్ ని ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాకు రూలర్.. క్రాంతి అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారని ఇంతకుముందు వినిపిస్తోంది. మరి వీటిలో ఏ టైటిల్ ని ఫైనల్ చేస్తారు? అంటూ అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఈ దసరా కానుకగా అభిమానులకు బాలయ్య టీమ్ టైటిల్ రహస్యం చెప్పేస్తుందనే భావిస్తే నిరాశపరిచారు.


అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి వేరొక టైటిల్ ని ఖాయం చేశారని వినిపిస్తోంది. రూలర్ కానీ.. క్రాంతి కానీ టైటిల్స్ కానీ ఫైనల్ కాలేదు. జడ్జిమెంట్ అనే టైటిల్ ని నిర్ణయించారట. అయితే చిత్రబృందం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ  రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఒక సిన్సియర్ పోలీస్ అధికారి గ్యాంగ్ స్టర్ గా మారడానికి కారణమేంటి? అన్నది తెరపై చూపిస్తున్నారన్న ముచ్చటా సాగుతోంది. దసరా కానుకగా రిలీజ్ చేసిన ఎన్ బీకే 105 కొత్త పోస్టర్ కి చక్కని స్పందన వచ్చింది. 

Latest News
 
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM
OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ 'రణం' Sat, Apr 20, 2024, 07:08 PM