సైరాను అల్లూ అర‌వింద్ ఎందుకు నిర్మించ‌లేదంటే....

by సూర్య | Fri, Oct 11, 2019, 01:35 AM

మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ స్టామినాను కరెక్ట్ గా అంచనా వేయగలిగిన వాళ్ళలో అరవింద్ ఒకరు.  ‘సైరా’ చిరంజీవికి డ్రీమ్ ప్రాజెక్ట్ అనే విషయం అరవింద్ గారికి 12 ఏళ్ళ క్రితమే తెలిసినప్పటికి, స్టార్ హీరోలకు ఈ ప్యాన్ ఇండియా సినిమాలు వర్క్ అవుట్ అయ్యే అవకాశం చాలా తక్కువనే సంగతి తెలుసు కాబట్టే ఆయన ‘సైరా’ నిర్మాణానికి దూరంగా ఉన్నారని ఫిలిం వ‌ర్గాల‌లో వినిపిస్తున్న గుస‌గుస‌. 
నిజానికి సినీ రంగంలో   అల్లు అరవింద్ లెజెండ్ ప్రొడ్యూసర్  ఒక కథ  ఆయనకు నచ్చి, పెట్టిన పెట్టుబడి కి నాలుగింతలు వస్తుందనుకుంటే ఏమాత్రం సంకోచించ కుండా ఇత‌ర నిర్మాత‌ల‌తో క‌ల‌సి అయినా సినీ నిర్మాణానికి సిద్ద‌మైపోతాడు ఎలాంటి ఆలోచన లేకుండా బడ్జెట్ కాస్త ఎక్కువైనా ఓకే అంటారు. అందునా మెగాస్టార్ హీరోగా అంటే సొంత బావ క‌న్నా ఇమేజ్‌ని క్యాష్ చేసుకోవ‌టం అర‌వింద్‌కి తెలిసినంత‌గా మ‌రొక‌రికి తెలియ‌దు. అందుకు గ‌త చిత్రాలే సాక్ష్యం.
అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ విడుదలై ఇప్పటికి వారం రోజులైనా తెలుగు నాట మిన‌హా మిగిలిన చోట్ల  కలెక్షన్స్ కాస్త ఇబ్బందిగానే ఉంద‌న్న‌ది వాస్త‌వం. ‘సైరా’ దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కాగా....   బ్రేక్ ఈవెన్ కు వ‌సూల‌వుతున్న‌ కలెక్షన్స్ ఏమాత్రం సరిపోవన్న‌ది సినీ పండితుల మాట‌.ఇతర ప్రాంతంలోనూ  కలెక్షన్ అంచనాలను అందుకోని ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందన్న విషయం మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముందే ఊహించారని అందుకే ఈ సినిమాకు దూరంగా ఉన్నారని, చిరు మార్కెట్ కంటే డబల్ బడ్జెట్ తో నిర్మించ‌డం అన‌వ‌స‌ర‌మ‌నే ముందుకు రాకపోవడానికి అసలు కారణం అదేనని ఇన్‌సైడ్ టాక్. అంతే మ‌రీ ఎక్క‌డైనా బావ కానీ.... బ‌డ్జెట్ ద‌గ్గ‌ర కాద‌ని, సినిమా చీదేస్తే... మొత్తం హుళ‌క్కేన‌న్న నానుడి వంట బ‌ట్టించుకున్న అర‌వింద్‌కి కొత్త‌గా చెప్పాలా ఎవ‌రైనా? అన్న‌ది ఫిలింన‌గ‌ర్‌లో వినిపిస్తున్న మాట‌. 


 


 

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM