ప్రిన్సెస్ డయానా కోసం కొట్టుకున్న‌హీరోలు

by సూర్య | Thu, Oct 10, 2019, 09:30 AM

అందంతో మంత్రముగ్ధుల్ని చేసే ప్రిన్సెస్ డయానాను చూస్తే అలా శిలలైపోవడం తథ్యం. సాధారణ యువకుల నుంచి ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారులైన హాలీవుడ్ హీరోలు సైతం ప్రిన్సెస్ డయానా కోసం కొట్టుకుచచ్చేవాళ్లు. రెండు దశాబ్దాల క్రితం కారు ప్రమాదంలో మృతి చెందిన ప్రిన్సెస్ డయానా అందానికి ప్రతిరూపం అంటే ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. అలాంటి ప్రిన్సెస్ డయానా కోసం ఒకప్పటి హాలీవుడ్ హీరో సిల్వస్టెర్ స్టాలెన్,నటుడు రిచర్డ్ గేరేలు కొట్టుకున్న  విష‌యాన్ని ఇటీవల హాలీవుడ్ సింగర్ ఎల్టన్ జాన్  ఓ ఇంటర్‌వ్యూలో   వెల్లడించాడు. ఆయ‌న చెప్పిన వివ‌రాల ప్ర‌కారం


ప్రిన్స్ ఆఫ్ వేల్స్ చార్లెస్ నుంచి విడిపోయిన అనంతరం లండన్ లో వాల్ట్ డిస్నీ అధినేత జెఫరీ కాట్జెన్‌బర్గ్‌ ఇచ్చిన ఓ విలాసవంత విందులో డయానా పాల్గొన్నప్పుడు ఈ విందుకు వ‌చ్చిన‌ హాలీవుడ్ హీరో స్టాలెన్,నటుడు గేరేలు డయానాను కలవడానికి చాలా ప్రయత్నించారు. అయితే గేరే కి మాత్రం  పార్టీలో డయానా ని నేరుగా ఓ ప్రత్యేక గదిలో కలుసుకునే ఛాన్స్ దొరికింది.  అక్క‌డ ప్రిన్సెస్ డయానాతో రిచర్డ్ గేరే ఫ్రెండ్ షిప్ చాలా క్లోజ్ గా మారుతున్న‌ట్టు క‌నిపించ‌డంతో స్టాలెన్ అసూయతో రగిలిపోయి, త‌నూ డయానాకు చేరువయ్యేందుకు ప్రయత్నించాడు. అక్క‌సుతో పార్టీలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించాడు. దీంతో   ఆ పార్టీలో ఏర్పాటు చేసిన డిన్నర్ కు గేరే, స్టాలెన్ హాజరుకాలేదు. 


అయితే  ఆ విందులో వాళ్లు ఇద్దరు కొట్టుకోవడం, గొడవపడటం, ముష్టిఘాతాలు కూడా చోటుచేసుకొన్నాయి. ఆ సందర్భంలో కొందరు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది అని ఎల్టన్ తెలిపారు.


లండన్లో పార్టీ తర్వాత ఓ చలిమంట ముందు డయానా, రిచర్డ్ గేరే కూర్చొని కబుర్లాడుకోవడం కనిపించింది. ఆ గొడవ తర్వాత తీవ్ర ఆగ్రహంతో స్టాలెన్ ఇంటికి వెళ్లిపోయారని ఎల్టన్ తెలిపాడు.అటువంటి అనేక మధురస్మృతుల విషయాలకు గేరే పుస్తకరూపం కల్పించిన అక్టోబర్ 15న పుస్తకాన్ని విడుదల చేయనున్నారని ఆయ‌న తెలిపారు. 


 


 

Latest News
 
రోడ్డు ప్రమాదానికి గురైన బుల్లితెర నటి Fri, Apr 19, 2024, 01:43 PM
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘టిల్లు స్క్వేర్’ Fri, Apr 19, 2024, 01:42 PM
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM