బాలీవుడ్‌కేగుతున్న న‌వ‌దీప్‌

by సూర్య | Thu, Oct 10, 2019, 08:55 AM

004లో వచ్చిన "జై" సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన హీరో నవదీప్‌  తెలుగు, తమిళ భాషలలో పలు చిత్రాలు చేసి  ఇప్పుడు కేవలం సపోర్టింగ్ క్యారెక్టర్స్,  టీవీ షోలకు వ్యాఖ్యాతగా  ప‌రిమిత‌మైపోయాడు.  అల్లు అర్జున్ 19వ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న న‌వ‌దీప్ సిక్స్ ప్యాక్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కండలు తిరిగిన దేహంతో బాలీవుడ్ హీరో లుక్‌లో కన్పించి నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు నవదీప్. మరో పక్క బాలీవుడ్‌లో తొలి అవకాశంలోనే హాట్ నటి సన్నీ లియోనీతో కలిసి పని చేయబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏఎల్‌టీ బాలాజీ హిందీలో "రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్" అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇందులో నవదీప్‌, సన్నీ లియోనీ కలిసి పనిచేయబోతున్నారు. ఈ సందర్భంగా సెట్‌లో వీరిద్దరూ కలిసి సెల్ఫీ దిగారు.


ఈ సెల్ఫీని సన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. "నవదీప్‌తో కలిసి పనిచేయబోతున్నాను. ఇలాంటి మంచి వ్యక్తితో కలిసి పనిచేయబోతున్నందుకు సంతోషంగా ఉంది" అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు నవదీప్ రిప్లై ఇస్తూ.. "మై ప్లెజర్ సన్నీ. యూ ఆర్ సో ఫన్నీ" అని క్యాప్షన్ ఇచ్చాడు. 


"రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్" ఓ ఎరాటిక్ హారర్ సిరీస్. 2014లో "రాగిని ఎంఎంఎస్ 2" టైటిల్‌తో ఓ హారర్ సినిమా విడుదలై సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.


 


 


 

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM