వినాయ‌క్ హీరోగా దిల్‌రాజు సీన‌య్య ప్రారంభం

by సూర్య | Wed, Oct 09, 2019, 10:25 PM

ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ తొలిసారిగా హీరోగా నటిస్తున్న చిత్రం నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను దసరా పండుగ సందర్భంగా నిన్న విడుదల చేశారు. వినాయక్ పుట్టినరోజు కావడంతో బుధ‌వారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి.  ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి   సీనయ్య అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. 1980 నేపథ్యంలో వినాయక్‌ వయసుకు తగ్గట్టు పాత్ర ఉంటుందని సమాచారం. తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో ఈచిత్రంపై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.భారీ తమిళ చిత్రాల దర్శకుడు శంకర్‌ శిష్యుడు ఎన్‌. నరసింహారావు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ‘దిల్‌’ రాజు నిర్మాణంలో రూపొందుతోంది. 


 


 

Latest News
 
'ఫ్యామిలీ స్టార్' నుండి మధురము కదా వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 02:47 PM
ఆ ఒక్కటి అడక్కు : హమ్మమ్మో సాంగ్ విడుదలకి తేదీ ఖరారు Thu, Apr 25, 2024, 02:39 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'అఖండ' Thu, Apr 25, 2024, 02:37 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'మ్యూజిక్ షాప్ మూర్తి' Thu, Apr 25, 2024, 02:34 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'భీమా' Thu, Apr 25, 2024, 02:30 PM