తెలుగు రాష్ట్రాల్లో క‌లెక్ష‌న్ల‌లో సైరా హవా

by సూర్య | Wed, Oct 09, 2019, 07:49 PM

 ఎన్నో అంచనాలతో  భారీ బడ్జెట్‌తో రూపొందించిన  సైరా అటు వీకెండ్ ని, ఇటు పండుగ సీజన్‌ను  బాగా క్యాష్ చేసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ రావ‌టంతో తెలుగు రాష్ట్రాల్లో  సైరా హవా నడుస్తోంది.   హిందీలో, తమిళ్‌లో మాత్రం కలెక్షన్లు కాస్త తగ్గినా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ కలిపి 112 కోట్ల షేర్ వసూలు చేసింది. బాహుబలి 2 తర్వాత తొలి ఏడు రోజులలోనే కేవలం తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్లు షేర్ దాటిన తొలి సినిమా ఇదే .  నైజాంలో 23.70 కోట్ల షేర్ అందుకున్న సైరా ఆంధ్రాలో 60 కోట్ల మైలురాయి చేరుకుంది. ఈ సినిమా ఓవర్సీస్‌లో కూడా 2.4 మిలియన్ మార్క్ అందుకుంది.  ఖైదీ నెం 150 తర్వాత వరసగా రెండోసారి కూడా 100 కోట్ల షేర్ అందుకున్న హీరోగా మెగాస్టార్ మరో రికార్డ్ నెలకొల్పాడు.


 


 

Latest News
 
'వేట్టైయాన్‌' డిజిటల్ రైట్స్ పై లేటెస్ట్ బజ్ Wed, Apr 24, 2024, 03:26 PM
విదా ముయార్చి : త్రిష సెట్స్ లో జాయిన్ అయ్యేది అప్పుడేనా? Wed, Apr 24, 2024, 03:24 PM
'హనుమాన్' అంతర్జాతీయ విడుదలపై లేటెస్ట్ అప్డేట్ Wed, Apr 24, 2024, 03:16 PM
'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ ఎంట్రీ ఎప్పుడంటే...! Wed, Apr 24, 2024, 03:12 PM
100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'ఆవేశం' Wed, Apr 24, 2024, 03:07 PM