సైరా గురించి బాల‌య్య మాట్లాడ‌లేదెందుకు?

by సూర్య | Wed, Oct 09, 2019, 06:52 PM

మెగాస్టార్ కెరీర్ లోనే ఒక మైలురాయి లాంటి సినిమా సైరా, టాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా అటు హిందీ నుండి, తమిళ్ నుండి అగ్ర హీరోలు చిరంజీవి నటనని మెచ్చుకుంటున్నారు. ఇక స‌హ‌చ‌ర న‌టులు నాగార్జున, వెంకటేష్   చిరంజీవి నటనని మెచ్చుకున్నారు,  మహేష్ బాబు, రానా, ఎన్టీఆర్,నాని, రామ్ లాంటి హీరోలు మెగాస్టార్ కి ఫోన్ చేసి శిఖ‌ర స‌మాచారం అంటూ అభినంద‌న‌లు తెలిపారు. కానీ సీనియర్ నటుడు బాలకృష్ణ మాత్రం సైరా సినిమా గురించి ఒక్క మాట మాట్లాడినట్లు ఎక్కడ కూడా క‌నీస వార్త రాలేదు. 


  ఇందుకు ప్ర‌ధాన కార‌ణం బాలకృష్ణ,చిరంజీవి మధ్య చిన్నపాటి  విభేదేలే అని టీలీవుడ్‌లో విన‌వ‌స్తోంది.  కొద్దికాలం క్రితం వ‌ర‌కు ఫాన్స్ గ్రూప్స్ సామాజిక మీడియాలో దుమ్మెత్తుకు పోసుకునేవి. సినిమాల‌లో నూ ఒక‌రునొక‌రు దెప్పిపొడుచుకునే డైలాగులు రాయించుకునే వార‌న్న అప‌ప్ర‌ద ఉండ‌నే ఉంది. ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య సైరా గురించి ఎక్క‌డా మాట్లాడ‌లేద‌న్న‌ది కొంద‌రి మాట‌. అయితే ప్రస్తుతం అవేమి లేవంటూ మ‌రి కొందరు చెపుతున్నప్ప‌టికీ  వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ అలాగే కొనసాగుతున్నట్లు తెలుస్తోంద‌ని ఓ గుస‌గుస . 


 

Latest News
 
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM