పెళ్లి పీటలెక్కనున్న ఎవ్లీన్ శర్మ

by సూర్య | Wed, Oct 09, 2019, 02:34 PM

బాలీవుడ్ బ్యూటీ ఎవ్లీన్ శర్మ సాహో మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అలరించారు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన ఎవ్లీన్ పెళ్లికి సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియా కి చెందిన డాక్టర్ మరియు వ్యాపారవేత్త అయిన తుస్సాన్ బింది ని ఆమె వివాహం చేసుకోనున్నారు. గత శనివారం ఈ బ్యూటిఫుల్ కపుల్ ఎంగేజ్ మెంట్ జరుపుకొని ఈ విషయాన్ని ధృవీకరించారు. గత ఏడాదిగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే సినిమాలు తగ్గించిన ఎవ్లీన్ ఆయనతో పెళ్లి తరువాత ఆస్ట్రేలియా లో సెటిల్ కానున్నారట. ఏడాది క్రితం ఓ ఫంక్షన్ లో కలిసిన ఈ జంట పరిచయం కాస్తా ప్రేమగా మారిందని సమాచారం. ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్ మూవీ తో బాలీవుడ్ కి పరిచయమైన ఎవ్లీన్ హిందీ మీడియం, జబ్ హరీ మెట్ సజల్ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు. కాగా ఈ జంట పెళ్లి ముహూర్తం త్వరలో ప్రకటిస్తారట.

Latest News
 
100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'ఆవేశం' Wed, Apr 24, 2024, 03:07 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ విడుదలకి తేదీ ఖరారు Wed, Apr 24, 2024, 03:02 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 02:59 PM
బుధవారం శ్రీకాంత్ స్పెషల్ మూవీస్ Wed, Apr 24, 2024, 02:49 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కూలీ' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 02:41 PM