వివి వినాయ‌క్ సీన‌య్య ఫస్ట్ లుక్

by సూర్య | Tue, Oct 08, 2019, 11:46 PM

ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ తొలిసారిగా హీరోగా నటిస్తున్న చిత్రానికి సీనయ్య అని పేరు పెట్టారు.   ఫస్ట్ లుక్ ను దసరా పండుగ సందర్భంగా విడుదల చేశారు. 1980 నేపథ్యంలో కథ సాగుతుందనీ, వినాయక్‌ వయసుకు తగ్గట్టు పాత్ర ఉంటుందని సమాచారం. తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో ఈచిత్రంపై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.


వినాయక్ పుట్టినరోజు అక్టోబర్‌ 9న ఆయన కథానాయకుడిగా పరిచయం కానున్న చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలు కానుంద‌ని, ప్ర‌క‌టించినా విజయదశమి పండుగ ఘడియలు కూడా కలిసి వస్తుండటంతో ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. భారీ తమిళ చిత్రాల దర్శకుడు శంకర్‌ శిష్యుడు ఎన్‌. నరసింహారావు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ‘దిల్‌’ రాజు నిర్మాణంలో రూపొందుతోంది. ఇందులో పాత్ర కోసం వీవీ వినాయక్‌ జిమ్‌లో చెమట చిందుస్తు, బరువు కూడా బాగా తగ్గుతున్నాడట. మరి హీరో గెటప్ రావాలి కదా.


 

Latest News
 
సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయనతార ? Fri, Apr 19, 2024, 11:19 AM
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM