చిరంజీవి-కొర‌టాల సినిమాకి కొబ్బ‌రికాయ‌ కొట్టేసారుగా...

by సూర్య | Tue, Oct 08, 2019, 10:51 PM

దసరా సందర్భంగా చిరంజీవి తన 152వ చిత్రాన్ని పూజతో ప్రారంభించారు ,  మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.    కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
దసరా పండగరోజు మంచి ముహూర్తం కావడంతో ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. చిరు, రామ్‌ చరణ్‌, కొరటాల శివతోపాటు చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి, సురేఖ, సుస్మిత తదితరులు పూజకు హాజరయ్యారు. చిరంజీవి సతీమణి సురేఖ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తారు. కొరటాల శివ అంటే మంచి కథాబలం వున్న సినిమానే అయివుంటుందని ఆయన అభిమానులు అంటున్నారు. మిర్చి, శ్రీమంతుడు వంటి మంచి సినిమాలను అందించిన కొరటాల శివ, చిరంజీవికి సూటయ్యే సామాజిక కథాంశంతోనే సినిమా తీస్తున్నారని చెబుతున్నారు. కాగా ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కూడా ముఖ్య పాత్ర‌పోషిస్తార‌ని మ‌రో గుస‌గుస‌.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM