కైలాసపురం కింగ్స్ టీజర్ లాంచ్

by సూర్య | Tue, Oct 08, 2019, 08:55 AM

వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ కైలాసపురం కింగ్స్ టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే నిర్మాత రాజ్ కందుకూరి, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత రిజ్వాన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అథితులుగా విచ్చేసారు.
ఈ సందర్బంగా నిర్మత రాజ్ కందుకూరి మాట్లాడుతూ…ఈ సినిమా నేను చూశాను, బాగా నచ్చింది. వైజాగ్ నేపథ్యంలో జరిగే మాస్ ఎంటర్టైన్ సబ్జెక్ట్ ఇది. కంచర్ల పాళ్యం సినిమా తరహాలో ఈ సినిమా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయనుంది. ఆడియన్స్ కు కావాల్సిన అనీ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. కైలాసపురం కింగ్స్ లో నటించిన నటీనటులకు టెక్నీషియన్స్ కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.
  నిర్మాత తేజ్ వైజాగ్.. మాట్లాడుతూ…నాకు వైజాగ్ అంటే ప్రాణం. వైజాగ్ లో జరిగే చిత్ర షూటింగ్స్ కు నేను హెల్ప్ చేస్తుంటాను. నాకు ర్ చిత్ర కథ దర్శకుడు కులదీప్ చెప్పగానే నచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోంది అన్నారు.
డైరెక్టర్ కులదీప్ రాజాన మాట్లాడుతూ…నేను రాసుకున్న కథకు హీరో రమేష్ పూర్తి న్యాయం చేశాడు. మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. నిర్మాత తేజ్ వైజాగ్ గారు నన్ను బాగా సపోర్ట్ చేస్తూ సినిమాను బాగా నిర్మించారు అన్నారు.

Latest News
 
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM
'మా నాన్న సూపర్ హీరో' విడుదల అప్పుడేనా? Thu, Apr 18, 2024, 07:11 PM
50 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసిన 'వర్షంగల్కు శేషం' Thu, Apr 18, 2024, 07:10 PM