ఇంత‌కీ సైరా హిట్టా..? ఫట్టా..?

by సూర్య | Tue, Oct 08, 2019, 08:38 AM

మెగాస్టార్ చిరంజీవి   సైరా సినిమా విడుద‌ల నాటి నుంచి అన్ని వ‌ర్గాల‌లో  పాజిటివ్ టాక్  వినిపించింది.   తెలుగు,తమిళ్,హిందీ,కన్నడ,మలయాళం ఇలా అన్ని భాషల్లో విడుద‌లైన ఈ చిత్రం సౌత్,నార్త్, ఓవర్శిస్ ఏరియాలో కూడా సినిమా అదిరింది అనిపించుకుంది. అయినా ఒక్క తెలుగులో త‌ప్ప  మిగతా  భాష‌ల‌లో సినిమిమా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు  కలెక్షన్స్ క‌నిపించ‌డంలేద‌ని వాపోతున్నాయి సినిమా యూనిట్‌.


ఇక ఓవర్శిస్ లో మొదటి రోజే దాదాపుగా వన్ మిలియన్ క్లబ్ లోకి చేరింది సైరా.  నాలుగు రోజు నాటికి   2 మిలియన్స్ క్లబ్ లో చేరినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది .  ఇందుకు వీకెండ్ డేస్ క‌ల‌సి వ‌చ్చాయి.  ఈ సిపిమా అక్కడ 20 కోట్లకి అమ్మకం కాగా  సేఫ్ వెంచర్ కోసం ఖచ్చితంగా 3.5 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకోవాలి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే లాంగ్ రన్ లో కూడా 3 మిలియన్స్ వ్యూస్ సాధించటమే కష్టమైన పనిగానే క‌నిపిస్తోంది. వచ్చే వారాంతం వ‌ర‌కు  ఎలాగోలా రన్ అయినా కానీ వస్తే మరో ఆఫ్ మిలియన్ మార్క్ అయితే టచ్ చేస్తుందని, ఈ లెక్కన చూసుకుంటే ఓవర్శిస్ లో సైరా సినిమా ప్లాప్ అయినట్లే లెక్కని సినీ ట్రేడ‌ర్లు చెపుతున్నారు.


 సినిమాకు పాజిటివ్  టాక్   కంటే   కలెక్షన్స్ ఎంత వచ్చాయనే దానిమీదే ఈ రోజుల్లో సినిమా హిట్టా..? ఫట్టా..? అనేది ఆధారపడి ఉంటుంద‌ని,  సైరా ఓవర్శిస్ లో క‌లెక్ష‌న్ల ప‌రంగా ప్లాప్ అనే చెప్పాల్సి రావ‌చ్చు. 


 తెలుగులో ప్ర‌మోష‌న్ కు ఉత్స‌హాం చూపిస్తున్న చిత్ర యూనిట్ హిందీ లో  దానిగురించి పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు,  క‌నీసం  మీడియాకు  సైరా గురించి  అప్డేట్ కూడా ఇవ్వక పోవ‌టంతో ఎక్క‌డా ఈ సినిమా ప్ర‌స్థావ‌న లేకుండా పోతోంది. దీనికి తోడు వార్ చిత్ర పోటీ ఉండ‌నే ఉంది. మరో వారం ఆగితేకాని  మొత్తానికి సైరా కథ  హిట్టా..? ఫట్టా..? అన్న‌ది  పూర్తిగా తేలిపోతుంది.


 


 

Latest News
 
'ది 100' టీజర్ ని విడుదల చేయనున్న మెగా మదర్ Thu, Apr 25, 2024, 08:35 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'రత్నం' Thu, Apr 25, 2024, 08:28 PM
'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, Apr 25, 2024, 08:27 PM
రేపే 'టిల్లు స్క్వేర్' డిజిటల్ అరంగేట్రం Thu, Apr 25, 2024, 08:23 PM
రేపు రివీల్ కానున్న 'ఒదెల 2' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 25, 2024, 08:21 PM