క్యాన్సర్‌ బాధితుల కోసం తోచిన సాయం చేయండి : సన్నీ లియోన్

by సూర్య | Mon, Oct 07, 2019, 03:21 PM

క్యాన్సర్‌ బాధితుల కోసం తనవంతు సాయం అందించాలని ముందుకు వచ్చారు ఒకప్పటి పోర్న్‌స్టార్‌, బాలీవుడ్‌ నటి సన్నీలియోనీ. ఇందుకోసం పెయింటింగ్‌లు వేసి వాటిని వేలం పెట్టనున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఇటీవల విడుదలైన ‘అర్జున్‌ పాటియాలా’లో మెరుపులా మెరిసిన సన్నీలియోనీ ప్రస్తుతం ‘స్ల్పిట్స్‌ విల్లా సీజన్‌ 12’ రియాల్టీ షోతో బిజీగా ఉన్నారు. హర్రర్‌, కామెడీ నేపథ్యంతో సాగే ‘కోకాకోలా’ సినిమాలో కూడా నటించనున్నారు. అంత బిజీలోనూ ఆమె ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడాన్ని పలువురు అభినందిస్తున్నారు.


‘క్యాన్సర్‌ బాధితుల కోసం నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నాను. ఇందుకోసం పెయింటింగ్స్‌ వేశాను. వాటిని వేలానికి ఉంచుతున్నాను. అలా వచ్చిన డబ్బును క్యాన్సర్‌ బాధితులకు అందజేస్తాను‘ అంటూ పోస్టు చేశారు. ఈ సందర్భంగా కొన్ని పెయింటింగ్స్‌ కూడా సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.'పెయింటింగ్‌లు వేసినప్పుడే క్యాన్సర్‌ బాధితుల కోసం ఆలోచించాను. మీరు కూడా క్యాన్సర్‌ బాధితుల కోసం తోచిన సాయం చేయండి' అంటూ సూచించారు.


 


 

Latest News
 
'లక్ష్మీ కటాక్షం' మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ Mon, Apr 15, 2024, 10:37 PM
'ప్రతినిధి 2' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Mon, Apr 15, 2024, 07:17 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'విశ్వం' ఫస్ట్ స్ట్రైక్ Mon, Apr 15, 2024, 07:15 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'బాక్' Mon, Apr 15, 2024, 07:13 PM
'గీతాంజలి మళ్ళీవచ్చింది' నార్త్ అమెరికా గ్రాస్ ఎంతంటే ...! Mon, Apr 15, 2024, 07:08 PM