|
|
by సూర్య | Sun, Mar 15, 2026, 02:17 PM
ప్రముఖ బాలీవుడ్ నటి మధు మల్హోత్రా (72) కన్నుమూశారు. 1980, 90వ దశకాల్లో అనేక చిత్రాల్లో సహాయ నటిగా నటించిన ఆమె, సుభాష్ ఘాయ్ చిత్రం 'హీరో'లోని 'లంబి జుడై' పాటలో జిప్సీ మహిళగా నటించి విశేష గుర్తింపు పొందారు. అమితాబ్ బచ్చన్ నటించిన 'సత్తే పే సత్తా' వంటి చిత్రాల్లోనూ ఆమె నటించారు. ప్రధాన పాత్రలు పోషించకపోయినా, తనదైన నటనతో హిందీ సినీ పరిశ్రమలో సుపరిచితమైన గుర్తింపును సంపాదించుకున్నారు.
Latest News