‘విశ్వంభర’ గ్రాఫిక్స్‌పై చిరంజీవి అసంతృప్తి

by సూర్య | Sat, Feb 14, 2026, 04:08 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న 'విశ్వంభర' సినిమా గ్రాఫిక్స్ విషయంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే ఒక గ్రాఫిక్స్ కంపెనీతో చేసిన పని నచ్చకపోవడంతో, మరో కంపెనీతో చేయించినట్లు సమాచారం. అయితే ఆ అవుట్‌పుట్ కూడా చిరంజీవికి నచ్చలేదట. దాంతో సినిమా విడుదలపై, దాని భవిష్యత్తుపై సినీ మేధావులు, విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి.. బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. విశ్వంభరతో చిరంజీవికి ఇదే జరుగుతుందిప్పుడు. షూటింగ్ పూర్తై.. చాలా రోజులవుతున్నా ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు. ప్రమోషన్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. అప్పట్లో ఓ టీజర్.. ఆ తర్వాత ఓ పాట వచ్చాయంతే. ఆ తర్వాత శంకరవరప్రసాద్ వైపు వెళ్లిపోయారు చిరు. జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫాంటసీ కావడంతో.. భారీ అంచనాల మధ్య మొదలైంది విశ్వంభర. షూటింగ్ కూడా త్వరగానే పూర్తి చేసారు వశిష్ట. 2025 సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమా.. గ్రాఫిక్స్ కారణంగా ఆలస్యమైంది. అందుకే ఈ గ్యాప్‌లో మన శంకరవరప్రసాద్ గారుతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు చిరు. విశ్వంభరను వదిలేసారంటూ మెగా ఫ్యాన్స్ సైతం నిట్టూరుస్తున్న వేళ.. మెగా అప్‌డేట్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ ఓ పాటో మెరుస్తున్నారు. 

Latest News
 
ఈ ఇద్దరు హీరోలతో ఇక నటించను: నయనతార Tue, Mar 10, 2026, 12:12 PM
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి Tue, Mar 10, 2026, 12:11 PM
వారణాసిలో కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిన Mahesh Babu.. ఫోటోలు ట్రెండింగ్ Mon, Mar 09, 2026, 10:42 PM
Dandupalyam హీరోయిన్ ట్రాన్స్‌ఫర్మేషన్.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో Mon, Mar 09, 2026, 10:39 PM
'మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది'.. Ahaలో మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ Mon, Mar 09, 2026, 10:29 PM