ఆగష్టు 21 నాని 'ది ప్యారడైజ్' విడుదల

by సూర్య | Thu, Feb 12, 2026, 07:37 PM

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ సినిమా ఆగష్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ‘దసరా’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ మూవీ చేసి, కెరీర్‌లో మొట్టమొదటి రూ.100 కోట్ల సినిమా అందుకున్నాడు నాని. ఆ తర్వాత వీరి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ కావడంతో ‘ది ప్యారడైజ్’ మూవీపై అంచనాలు ఓ లెవెల్‌లో ఉన్నాయి. అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ వీడియోతో ఆ అంచనాలను పదింతలు పెంచేశాడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయి.స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయడానికి శ్రీకాంత్ ఓదెల టైమ్ తీసుకున్నాడు. ఆ తర్వాత షూటింగ్‌ కూడా ఆలస్యం కావడంతో మార్చిలో రిలీజ్ కావాల్సిన మూవీ, ఆగస్టు మూడో వారానికి వెళ్లింది.నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా పడడంతో రామ్ చరణ్ ‘పెద్ది’ ముందుగానే వాయిదా పడడంతో మార్చి మూడో వారంలో తెలుగులో రిలీజ్ అవుతున్న ఒకే ఒక్క పెద్ద సినిమా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘తేరీ’ రీమేక్‌గా మొదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీపై ఇండస్ట్రీలో ఏ మాత్రం అంచనాలు లేవు. అదీకాకుండా హరీశ్ శంకర్, ఈ మూవీ షూటింగ్ మధ్యలో గ్యాప్ రావడంతో రవితేజతో ‘రైడ్’ రీమేక్‌గా ‘మిస్టర్ బచ్చన్’ మూవీ చేసి, డిజాస్టర్ ఫేస్ చేశాడు.కాబ్టటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ హిట్టు కొట్టాలంటే ఏదో బలంగా కొట్టాల్సిందే. తెలుగులో పెద్ద సినిమాలు లేకపోవడంతో మార్చి నెలలో డబ్బింగ్ సినిమాల సందడి పెరగనుంది. ముఖ్యంగా ‘ధురంధర్’ మూవీ సీక్వెల్ ‘ధురంధర్ 2’ మూవీ మార్చి 19న థియేటర్లలోకి వస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన ‘ధురంధర్’ మూవీ, ఊహించని విధంగా హిందీలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ‘ధురంధర్ 2’ మూవీని హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

Latest News
 
వారణాసిలో కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిన Mahesh Babu.. ఫోటోలు ట్రెండింగ్ Mon, Mar 09, 2026, 10:42 PM
Dandupalyam హీరోయిన్ ట్రాన్స్‌ఫర్మేషన్.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో Mon, Mar 09, 2026, 10:39 PM
'మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది'.. Ahaలో మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ Mon, Mar 09, 2026, 10:29 PM
సల్మాన్ ఖాన్ సరసన నటించనున్న సమంత! Mon, Mar 09, 2026, 08:15 PM
కాబోయే భార్యతో హీరో బెల్లంకొండ.. ఎమోషనల్ ట్వీట్ Mon, Mar 09, 2026, 07:51 PM