హే భగవాన్ మూవీ కథ ఊహించి చెబితే రూ.20 వేల బహుమతి!

by సూర్య | Thu, Feb 12, 2026, 07:34 PM

నటుడు సుహాస్ నటిస్తున్న 'హే భగవాన్' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా, చిత్ర బృందం 'గెస్ ది స్టోరీ.. కొట్టేయ్ మనీ' అనే వినూత్న పోటీని ప్రకటించింది. సినిమా కథను ముందుగానే ఊహించి చెప్పిన వారికి రూ.10,000 బహుమతిగా ఇస్తామని మొదట ప్రకటించినా, వచ్చిన స్పందనతో ఆ మొత్తాన్ని రూ.20,000కు పెంచారు. అత్యుత్తమంగా కథను ఊహించిన టాప్ 5 మందిని ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో సన్మానించి బహుమతి అందజేయనున్నారు. గోపి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది.శివాని నగరం హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ , సుదర్శన్ వంటి కామెడీ స్టార్స్ ఉన్నారు. ఈరోజు రిలీజ్ ఐన ట్రైలర్ చూస్తుంటే సినిమా అంతా నవ్వులమయంగా ఉంటుందని అర్థమవుతోంది. ఈ కాంటెస్ట్ లో మరి ఎవరి గెస్ కరెక్ట్ అవుతుందో? ఆ టాప్ 5 అదృష్టవంతులు ఎవరో తెలియాలంటే ప్రీ-రిలీజ్ వేడుక వరకు ఆగాల్సిందే. సినిమా ప్రమోషన్స్ కోసం ఇలాంటి కొత్త ఆలోచనలు చేయడం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి మంచి దారి. కథను గెస్ చేయడం ద్వారా ప్రేక్షకులను కూడా సినిమా మేకింగ్‌లో భాగం చేసినట్లు అవుతుంది. ఇక ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం సుహాస్ కెరీర్‌లో మరో హిట్ నిలుస్తుందో లేదో చూడాలి.

Latest News
 
రూ.3 వేల కోట్లతో 'ధురంధర్' చిత్రం సరికొత్త చరిత్ర Thu, Apr 16, 2026, 02:23 PM
సినిమా ఐపీఎల్ మ్యాచ్ కన్నా బాగుంటుంది: తిరువీర్ Thu, Apr 16, 2026, 12:36 PM
'పెద్ది' సినిమా విడుదల వాయిదా.. కారణాలు ఇవే! Thu, Apr 16, 2026, 11:30 AM
విజయ్ దేవరకొండ ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్! Wed, Apr 15, 2026, 01:56 PM
బాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ లో మృణాల్ ఠాకూర్ Wed, Apr 15, 2026, 01:55 PM