ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్!

by సూర్య | Mon, Feb 09, 2026, 11:00 AM

సోషల్ మీడియా సెన్సేషన్‌గా కెరీర్ ప్రారంభించి, ప్రభాస్‌తో కలిసి నటించిన ఇమాన్వికి మరో అరుదైన అవకాశం దక్కింది. ప్రస్తుతం 'ఫౌజీ' సినిమాలో నటిస్తున్న ఆమె, పవన్ కల్యాణ్ నటించనున్న సురేందర్ రెడ్డి దర్శకత్వ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం లభించినట్లు సమాచారం. రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌‌ జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్ పాత్రకు కొత్తగా, ట్రెండీగా ఉండే హీరోయిన్‌‌ కావాలని భావించిన దర్శకుడు సురేందర్ రెడ్డి.. ఇమాన్వి పేరును ప్రతిపాదించగా పవన్ కళ్యాణ్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.  ఉగాదికి సినిమాను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.  ఇక ‘ఫౌజీ’లో క్లాసిక్ లుక్‌‌లో కనిపించనున్న ఇమాన్వి.. పవన్ సినిమాలో మాత్రం మోడ్రన్ అండ్ స్టైలిష్ క్యారెక్టర్‌‌‌‌లో కనువిందు చేయనుందనే టాక్‌‌ వినిపిస్తోంది. 

Latest News
 
ఈ ఇద్దరు హీరోలతో ఇక నటించను: నయనతార Tue, Mar 10, 2026, 12:12 PM
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి Tue, Mar 10, 2026, 12:11 PM
వారణాసిలో కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిన Mahesh Babu.. ఫోటోలు ట్రెండింగ్ Mon, Mar 09, 2026, 10:42 PM
Dandupalyam హీరోయిన్ ట్రాన్స్‌ఫర్మేషన్.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో Mon, Mar 09, 2026, 10:39 PM
'మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది'.. Ahaలో మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ Mon, Mar 09, 2026, 10:29 PM