జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్..

by సూర్య | Sun, Feb 08, 2026, 06:44 PM

యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' భారీ యాక్షన్ డ్రామా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించిన ఎన్టీఆర్ స్లిమ్ ఫిట్ బాడీ, లాంగ్ బియర్డ్, చెవికి రింగ్‌తో స్టైలిష్‌గా కనిపించారు. ఈ కొత్త లుక్‌ను అభిమానులు 'డ్రాగన్' ఫైనల్ లుక్‌గా భావిస్తున్నారు. 'డ్రాగన్' షూటింగ్ విదేశాల్లో, ముఖ్యంగా జోర్డాన్‌లో జరగనున్నట్లు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.జోర్డాన్ లో దాదాపు నెల రోజుల పాటు 'డ్రాగన్' షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కిస్తారట. ముఖ్యంగా ఎన్టీఆర్, మలయాళ స్టార్ టోవినో థామస్ మధ్య అదిరిపోయే సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నట్లు వినికిడి.మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'డ్రాగన్' నుంచి సర్ ప్రైజ్ లు రాబోతున్నాయి. టైటిల్ ను అధికారికరంగా ప్రకటించడంతో పాటు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని, స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేయనున్నారని సమాచారం. కొత్త విడుదల తేదీపై కూడా అప్పుడు క్లారిటీ వచ్చే అవకాశముంది.

Latest News
 
ఈ ఇద్దరు హీరోలతో ఇక నటించను: నయనతార Tue, Mar 10, 2026, 12:12 PM
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి Tue, Mar 10, 2026, 12:11 PM
వారణాసిలో కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిన Mahesh Babu.. ఫోటోలు ట్రెండింగ్ Mon, Mar 09, 2026, 10:42 PM
Dandupalyam హీరోయిన్ ట్రాన్స్‌ఫర్మేషన్.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో Mon, Mar 09, 2026, 10:39 PM
'మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది'.. Ahaలో మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ Mon, Mar 09, 2026, 10:29 PM