కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ?

by సూర్య | Sun, Feb 08, 2026, 12:43 PM

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి, కన్నడ చిత్రసీమలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రక్షిత్ శెట్టి నటించిన సూపర్ హిట్ చిత్రం ‘777 చార్లీ’ సీక్వెల్‌లో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం మీనాక్షి నాగచైతన్యతో ‘వృషకర్మ’తో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది. తన పట్టుదలతో, సరైన అవకాశాలను అందిపుచ్చుకుంటూ మీనాక్షి రాబోయే రోజుల్లో ఇతర ఇండస్ట్రీల్లోనూ తన సత్తా చాటుతుందని అభిమానులు నమ్ముతున్నారు.ఇటీవల కాలంలో తెలుగులో మీనాక్షి (Meenakshi Chowdhury) వరుస హిట్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’, ‘ సంక్రాంతికి వస్తున్నాం ’ వంటి చిత్రాలు ఆమె ఖాతాలో భారీ విజయాలుగా నిలిచాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మీనాక్షి క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిందని చెప్పొచ్చు.

Latest News
 
ఈ ఇద్దరు హీరోలతో ఇక నటించను: నయనతార Tue, Mar 10, 2026, 12:12 PM
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి Tue, Mar 10, 2026, 12:11 PM
వారణాసిలో కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిన Mahesh Babu.. ఫోటోలు ట్రెండింగ్ Mon, Mar 09, 2026, 10:42 PM
Dandupalyam హీరోయిన్ ట్రాన్స్‌ఫర్మేషన్.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో Mon, Mar 09, 2026, 10:39 PM
'మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది'.. Ahaలో మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ Mon, Mar 09, 2026, 10:29 PM