'మిరాయ్' నటుడు సునీల్‌ థాపా కన్నుమూత

by సూర్య | Sat, Feb 07, 2026, 08:19 PM

నేపాల్‌కు చెందిన ప్రముఖ నటుడు సునీల్‌ థాపా (68) కన్నుమూశారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో కాఠ్‌మాండూలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 300కు పైగా నేపాలీ, బాలీవుడ్‌, భోజ్‌పురి చిత్రాల్లో నటించి విశేష గుర్తింపు పొందారు. హిందీలో ‘మేరీ కోమ్’, తెలుగులో ‘మిరాయ్’ సినిమాలోనూ నటించారు. ఆయన మృతిపట్ల పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.సునీల్ థాపా ఆరోగ్య పరిస్థితి శనివారం ఉదయం హఠాత్తుగా క్షీణించడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే సరికే ఆయన స్పృహ కోల్పోయారని, ఉదయం 7:44 గంటలకు నిర్వహించిన ఈసీజీ (ECG)లో ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రాథమికంగా గుండెపోటు కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.1981లో కమల్ హాసన్ నటించిన క్లాసిక్ చిత్రం 'ఏక్ దూజే కేలియే' ద్వారా హిందీ తెరపైకి అడుగుపెట్టారు. ప్రియాంక చోప్రా నటించిన 'మేరీ కోమ్' చిత్రంలో నర్జిత్ సింగ్ (కోచ్) పాత్ర ఆయనకు దేశవ్యాప్త గుర్తింపునిచ్చింది. ఈ పాత్రకు గాను ఆయన ఫిలింఫేర్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు.'నసీబ్‌వాలా', 'మానవ హత్య' వంటి చిత్రాలతో పాటు, ప్రసిద్ధ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'లో కూడా ఆయన నటించారు. ఇటీవల విడుదలైన పాన్-ఇండియా చిత్రం 'మిరాయ్'లోనూ ఆయన కనిపించారు.

Latest News
 
రూ.3 వేల కోట్లతో 'ధురంధర్' చిత్రం సరికొత్త చరిత్ర Thu, Apr 16, 2026, 02:23 PM
సినిమా ఐపీఎల్ మ్యాచ్ కన్నా బాగుంటుంది: తిరువీర్ Thu, Apr 16, 2026, 12:36 PM
'పెద్ది' సినిమా విడుదల వాయిదా.. కారణాలు ఇవే! Thu, Apr 16, 2026, 11:30 AM
విజయ్ దేవరకొండ ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్! Wed, Apr 15, 2026, 01:56 PM
బాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ లో మృణాల్ ఠాకూర్ Wed, Apr 15, 2026, 01:55 PM