ట్రోలింగ్‌పై స్పందించిన షనయా కపూర్

by సూర్య | Sat, Feb 07, 2026, 03:32 PM

బాలీవుడ్ నటి షనయా కపూర్, తన లుక్స్, ఫేస్ కట్, శరీర సౌష్ఠవంపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను సానుకూలంగా తీసుకుంటానని, అయితే వ్యక్తిగత విమర్శలను మాత్రం తేలికగా తీసుకుంటానని ఆమె పేర్కొన్నారు.కానీ, పనితో సంబంధం లేని విమర్శల విషయంలో షనయా వైఖరి మరోలా ఉంటుందట. "నా ముఖం ఎలా ఉంది? నేను ఎందుకు ఇంత సన్నగా ఉన్నాను? నా దవడ పెద్దదిగా ఉందా? వంటి వ్యక్తిగత కామెంట్లను నేను పూర్తిగా విస్మరిస్తాను" అని షనాయా కపూర్ తెలిపారు. తన తల్లి మహీప్ కపూర్ తన బెస్ట్ ఫ్రెండ్ అని, ఆమెతోనే తన బాధలను పంచుకుంటానని షనయా తెలిపారు.ఇకపోతే షనయా కపూర్ తన బాలీవుడ్ డెబ్యూ చిత్రం 'ఆంఖోన్ కీ గుస్తాఖియాన్'  ద్వారా నటిగా పరిచయమయ్యారు. రస్కిన్ బాండ్ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సేతో కలిసి ఆమె నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, షనాయా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

Latest News
 
రూ.3 వేల కోట్లతో 'ధురంధర్' చిత్రం సరికొత్త చరిత్ర Thu, Apr 16, 2026, 02:23 PM
సినిమా ఐపీఎల్ మ్యాచ్ కన్నా బాగుంటుంది: తిరువీర్ Thu, Apr 16, 2026, 12:36 PM
'పెద్ది' సినిమా విడుదల వాయిదా.. కారణాలు ఇవే! Thu, Apr 16, 2026, 11:30 AM
విజయ్ దేవరకొండ ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్! Wed, Apr 15, 2026, 01:56 PM
బాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ లో మృణాల్ ఠాకూర్ Wed, Apr 15, 2026, 01:55 PM