తరుణ్ భాస్కర్ హీరోగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్.. టీజర్ డేట్ ఫిక్స్!

by సూర్య | Sat, Feb 07, 2026, 03:09 PM

దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ తన తదుపరి క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఆయన హీరోగా ‘గాయపడ్డ సింహం’ (GPS) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోంది. కశ్యప్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'డోంట్ లాఫ్.. ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్' అనే క్యాప్షన్‌తో విడుదలైన టైటిల్ పోస్టర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ టీజర్ విడుదల తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఫిబ్రవరి 9న టీజర్ ను విడుదల చేయనున్నట్లు పోస్టర్లో తెలిపారు.ఈ చిత్రాన్ని పవన్ సదినేని ప్రెజెంట్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్, టైటిల్‌ను చూస్తేనే ఓ రిట్రో-మోడరన్ వైబ్, కామెడీ-యాక్షన్ మిక్స్‌తో రెడీ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమా ట్రైలర్‌ను ఈనెల 9న విడుదల చేస్తు్న్నట్లు మేకర్స్ అఫిషియల్‌గా ప్రకటించారు. ఇందులో జేడీ చక్రవర్తి ఒక కీ రోల్‌లో కనిపించబోతున్నారు. తరుణ్ భాస్కర్ కెరీర్ విషయానికి వస్తే.. పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్‌లో సెనేషన్స్ సృష్టించిన డైరెక్టర్‌గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ యూత్‌ను మెస్మరైజ్ చేసిన ఈ యంగ్ డైరెక్టర్, తర్వాత తనలోని యాక్టర్‌ను వెండి తెరకు పరిచయం చేసి ఆడియన్స్‌ను సర్ ప్రైజ్ చేశాడు. 

Latest News
 
వారణాసిలో కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిన Mahesh Babu.. ఫోటోలు ట్రెండింగ్ Mon, Mar 09, 2026, 10:42 PM
Dandupalyam హీరోయిన్ ట్రాన్స్‌ఫర్మేషన్.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో Mon, Mar 09, 2026, 10:39 PM
'మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది'.. Ahaలో మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ Mon, Mar 09, 2026, 10:29 PM
సల్మాన్ ఖాన్ సరసన నటించనున్న సమంత! Mon, Mar 09, 2026, 08:15 PM
కాబోయే భార్యతో హీరో బెల్లంకొండ.. ఎమోషనల్ ట్వీట్ Mon, Mar 09, 2026, 07:51 PM