‘వారణాసి’ సినిమా అంతా ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌ కాదు: రాజమౌళి

by సూర్య | Sat, Feb 07, 2026, 03:06 PM

మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి తెరకెక్కిస్తున్న యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘వారణాసి’పై దర్శకుడు రాజమౌళి కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమా మొత్తం ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో ఉండదని, కీలక సన్నివేశాలు మాత్రమే ట్రూ ఐమ్యాక్స్‌ (1.43)లో చిత్రీకరిస్తున్నామని జక్కన్న స్పష్టం చేశారు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో మొదటిసారి రూపొందుతున్న చిత్రమిది. దీన్ని గ్లోబల్‌ ఫిల్మ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు రాజమౌళి. అంతర్జాతీయ మార్కెట్‌ని టార్గెట్‌ చేయడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఆయన పలు అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలిచ్చారు. ఇందులో మహేష్‌ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పాల్గొన్నారు. సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Latest News
 
పాప్ సింగర్ రిహన్న ఇంటిపై కాల్పులు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం Tue, Mar 10, 2026, 12:46 PM
ఈ ఇద్దరు హీరోలతో ఇక నటించను: నయనతార Tue, Mar 10, 2026, 12:12 PM
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి Tue, Mar 10, 2026, 12:11 PM
వారణాసిలో కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిన Mahesh Babu.. ఫోటోలు ట్రెండింగ్ Mon, Mar 09, 2026, 10:42 PM
Dandupalyam హీరోయిన్ ట్రాన్స్‌ఫర్మేషన్.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో Mon, Mar 09, 2026, 10:39 PM