రిటైర్మెంట్ వార్తలపై స్పష్టతనిచ్చిన విక్రాంత్ మాస్సే

by సూర్య | Sat, Feb 07, 2026, 12:53 PM

బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే తన రిటైర్మెంట్ వార్తలపై స్పష్టతనిచ్చారు. ఎక్కువ పని ఒత్తిడి కారణంగా సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకుంటున్నానని, శాశ్వతంగా నటనకు దూరమవుతానని తాను చెప్పలేదని ఆయన వెల్లడించారు. '12th ఫెయిల్‌' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విక్రాంత్, రోజుకు 16 గంటలు పనిచేయడం వల్ల అలసిపోయి కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్స్‌తో కెరీర్‌ ప్రారంభించిన విక్రాంత్‌..  2017లో 'ఎ డెత్‌ ఇన్‌ ది గంజ్‌' వెండితెరపై హీరోగా కనిపించారు. సుమారు 20కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అయితే, 12th ఫెయిల్‌ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫిలిం ఫేర్‌ అవార్డ్‌తో పాటు  'ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌'గా కూడా గుర్తింపు పొందారు. విక్రాంత్‌, షీతల్‌ ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారిద్దరూ.. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. వారికి కుమారుడు జన్మించగా అతడికి వర్దన్‌ అని నామకరణం చేశారు. 

Latest News
 
ఈ ఇద్దరు హీరోలతో ఇక నటించను: నయనతార Tue, Mar 10, 2026, 12:12 PM
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి Tue, Mar 10, 2026, 12:11 PM
వారణాసిలో కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిన Mahesh Babu.. ఫోటోలు ట్రెండింగ్ Mon, Mar 09, 2026, 10:42 PM
Dandupalyam హీరోయిన్ ట్రాన్స్‌ఫర్మేషన్.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో Mon, Mar 09, 2026, 10:39 PM
'మీ పాపాలకు ఒక సాక్షి ఉంటుంది'.. Ahaలో మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ Mon, Mar 09, 2026, 10:29 PM