|
|
by సూర్య | Sat, Jan 17, 2026, 05:49 PM
ముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బాలీవుడ్‌లో తనకు అవకాశాలు తగ్గడంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా స్పందించింది. రెహమాన్ తిరిగి హిందూ మతంలోకి మారితే మంచిదని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ వ్యాఖ్యానించారు.ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గాయని, దీనికి ఇండస్ట్రీలో మారిన 'పవర్ షిఫ్ట్' ఒక కారణమైతే, 'మతతత్వం' కూడా మరో కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. ఈ విషయం తనకు నేరుగా ఎవరూ చెప్పకపోయినా, పుకార్ల రూపంలో తెలిసిందని పేర్కొన్నారు.రెహమాన్ వ్యాఖ్యలను వినోద్ బన్సల్ తప్పుబట్టారు. "తనకు ఎందుకు పని దొరకడం లేదో ఆత్మపరిశీలన చేసుకోకుండా, మొత్తం పరిశ్రమ వ్యవస్థను నిందించడం సరికాదు. ఒకప్పుడు హిందువుగానే ఉన్న రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలతో ఏం నిరూపించాలనుకుంటున్నారు?" అని ఆయన ప్రశ్నించారు.
Latest News