|
|
by సూర్య | Wed, Jan 14, 2026, 02:24 PM
మాస్ మహారాజ రవితేజ తన కుమారుడు మహాధన్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన కుమారుడి భవిష్యత్తుపై తాను ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాలేదని, అది పూర్తిగా అతని ఇష్టమని స్పష్టం చేశారు. మహాధన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు కలిసి సందీప్ రెడ్డి వంగా వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నారు. పిల్లలకు స్వేచ్ఛనివ్వాలని, వారి నిర్ణయాలను గౌరవించాలని రవితేజ అన్నారు. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' చిత్రం మంగళవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
Latest News