రూ. 200 కోట్ల క్లబ్ లోకి 'ది రాజాసాబ్'

by సూర్య | Tue, Jan 13, 2026, 03:32 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ 'ది రాజాసాబ్'కు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ... కలెక్షన్ల పరంగా సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది. ఈ నెల 9న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ... నాలుగు రోజుల్లో రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 201 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా స్క్రిప్ట్ బలహీనంగా ఉందని, స్టోరీ డ్రాగ్ అవుతోందని, జానర్ల మధ్య కనెక్షన్ లేదని పలువురు క్రిటిక్స్, ఆడియన్స్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. రివ్యూలు కూడా 1.5 నుంచి 3 స్టార్ల మధ్యే ఉన్నాయి. కానీ కలెక్షన్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఓపెనింగ్ డే ప్రీమియర్లతో కలిపి రూ.100 కోట్లు దాటేసింది. మొదటి వీకెండ్ లోపల ఇండియాలో రూ.100+ కోట్లు, వరల్డ్‌వైడ్ రూ.150-160 కోట్లు దాటాయి. నాలుగు రోజుల్లో రూ.200 కోట్లు దాటింది.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM