రాజకీయ నాయకుడి పర్యటన ట్రాఫిక్‌ను గంటల తరబడి నిలిపివేయడం దారుణం

by సూర్య | Tue, Jan 13, 2026, 03:04 PM

సినీ నటి ప్రణీత సుభాష్ వీఐపీ సంస్కృతిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరులో ఓ రాజకీయ నాయకుడి పర్యటన కోసం ట్రాఫిక్‌ను గంటల తరబడి నిలిపివేయడంపై ఆమె సోషల్ మీడియా వేదికగా అసహనం ప్రదర్శించారు. సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఇలాంటి చర్యల వల్లే దేశం ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.బెంగళూరులోని సిటీ సెంటర్, కోరమంగళకు వెళ్లే మార్గాలను ఓ వీఐపీ కాన్వాయ్ కోసం మూసివేయడంతో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ పరిణామంపై స్పందించిన ప్రణీత, "ఇది చాలా చికాకుగా ఉంది. ఓ రాజకీయ నాయకుడి వీఐపీ పర్యటన కోసం రోడ్లను మూసివేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కచ్చితంగా ఇలాంటి వాటి వల్లే మన దేశం ఎప్పటికీ ముందుకు వెళ్లదు" అని పేర్కొన్నారు."రాజకీయ నాయకులు, వారి వీఐపీ జీవితాలు దేశ ప్రగతికి ఏమాత్రం సాయపడకపోగా, మరిన్ని సమస్యలను మాత్రమే సృష్టిస్తున్నాయి" అంటూ ఆమె తన పోస్టులో ఘాటుగా విమర్శించారు. ప్రణీత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Latest News
 
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM
మహేష్-రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్: భారీ ప్రమోషన్ ప్లాన్ సిద్ధం Sun, Feb 08, 2026, 12:41 PM