మాకు ఇంతమంది అభిమానులు ఉన్నారంటే అయన చలవే

by సూర్య | Mon, Jan 12, 2026, 01:40 PM

నేను ఒక్క సినిమా చేయకపోయినా నన్ను అభిమానిస్తున్నారంటే అది తాత కృష్ణ గారి చలవేనని ఆయన మనవడు ఘట్టమనేని జయకృష్ణ అన్నారు. విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని పద్మాలయ సంస్థ అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, జయకృష్ణ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జయకృష్ణ మాట్లాడుతూ నేను ఏమి చేసినా ఆయన (తాతయ్య) నా పక్కన ఉండి నడిపిస్తున్నారని అనిపిస్తుందన్నారు. ఆయన గర్వపడేలా ఉండటమే నా జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. నా జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తి మా బాబాయి మహేశ్ బాబు, ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయనకు తాను వీరాభిమానినని చెప్పుకున్నారు. ఆయన నా మొదటి సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారన్నారు.40 ఏళ్ల క్రితం కృష్ణ గారి అగ్నిపర్వతం సినిమాను నిర్మాత అశ్వనీదత్ నిర్మించారని, ఆ తర్వాత 1999లో మహేశ్ బాబును ఆయనే లాంచ్ చేశారని, ఇప్పుడు ఆయన నన్ను నమ్మి లాంచ్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. తాను హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో 'శ్రీనివాస్ మంగాపురం' చిత్రం తెరకెక్కుతున్నట్లు జయకృష్ణ తెలిపారు.

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM