ఆసక్తికరంగా 'నరి నరి నడుమ మురారి' ట్రైలర్‌

by సూర్య | Mon, Jan 12, 2026, 01:35 PM

హీరో శర్వానంద్ నటిస్తున్న కొత్త చిత్రం 'నరి నరి నడుమ మురారి' ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రానున్న ఈ ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పంచుతోంది. పాత ప్రేమ కథ తన ప్రస్తుత వైవాహిక జీవితాన్ని నాశనం చేయకుండా ఓ యువకుడు పడే పాట్లను సరదాగా చూపించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 14న థియేటర్లలోకి రానుంది.ట్రైలర్‌ను పరిశీలిస్తే, కథానాయకుడు గౌతమ్ (శర్వానంద్) పాత్రను పరిచయం చేశారు. ఇంజినీరింగ్ చదివి ఆర్కిటెక్ట్‌గా ఎందుకు పనిచేస్తున్నావని కాబోయే మామ అడిగిన ప్రశ్నకు, "నేను మాత్రమే కాదు, బీటెక్ చదివిన ఏ అబ్బాయి కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేడు" అని చెప్పే డైలాగ్ యువతను ఆకట్టుకుంటోంది. నిత్య (సాక్షి వైద్య)తో పెళ్లైన తర్వాత, గౌతమ్ జీవితంలోకి అతని మాజీ ప్రియురాలు (సంయుక్త) తిరిగి వస్తుంది. తమ పాత కథ గురించి భార్యకు చెప్పాలని ఆమె పట్టుబట్టడంతో వచ్చే సమస్యల చుట్టూ సినిమా తిరుగుతుందని స్పష్టమవుతోంది.ఈ సినిమా విడుదలలో చిత్ర బృందం ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. జనవరి 14న సాయంత్రం 5:49 గంటల నుంచి షోలు ప్రారంభమవుతాయని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఉదయం షోలతో ప్రారంభమయ్యే సినిమాలకు భిన్నంగా, సాయంత్రం షోను ఎంచుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Latest News
 
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM
మహేష్-రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్: భారీ ప్రమోషన్ ప్లాన్ సిద్ధం Sun, Feb 08, 2026, 12:41 PM