|
|
by సూర్య | Mon, Jan 12, 2026, 12:13 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' మూవీ జనవరి 9 విడుదలై మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రానికి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.161కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు Sacnilk వెబ్ సైట్ పేర్కొంది. ఇండియాలో రూ.129.20కోట్లు, ఓవర్సీస్ లో రూ.31.80 కోట్లు రాబట్టినట్లు తెలిపింది. మూడో రోజు ఇండియాలో రూ.22.6 కోట్లు కలెక్ట్ చేసిందని పేర్కొంది. కాగా నార్త్ అమెరికా గ్రాస్ కలెక్షన్స్ $2.2M (రూ.19.83కోట్లు) దాటినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది.
Latest News