విజయ్ తాజా చిత్రం 'జన నాయగన్' కు లభించని సెన్సార్ క్లియరెన్స్

by సూర్య | Fri, Jan 09, 2026, 08:43 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం 'జన నాయగన్'కు మరో షాక్ తగిలింది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డును మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్ర దర్శకనిర్మాతలు, విజయ్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అయితే, సింగిల్ బెంచ్ ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ లో సెన్సార్ బోర్డు సవాల్ చేసింది. పిటిషన్ ను విచారించిన ధర్మాసనం సర్టిఫికెట్ జారీపై తాత్కాలికంగా స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. దీంతో, విజయ్ అభిమానులు షాక్ కు గురయ్యారు. హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయం కారణజననాయగన్ జనవరి 21 వరకు విడుదలయ్యే అవకాశాలు లేవు. 

Latest News
 
రూ.3 వేల కోట్లతో 'ధురంధర్' చిత్రం సరికొత్త చరిత్ర Thu, Apr 16, 2026, 02:23 PM
సినిమా ఐపీఎల్ మ్యాచ్ కన్నా బాగుంటుంది: తిరువీర్ Thu, Apr 16, 2026, 12:36 PM
'పెద్ది' సినిమా విడుదల వాయిదా.. కారణాలు ఇవే! Thu, Apr 16, 2026, 11:30 AM
విజయ్ దేవరకొండ ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్! Wed, Apr 15, 2026, 01:56 PM
బాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ లో మృణాల్ ఠాకూర్ Wed, Apr 15, 2026, 01:55 PM