పాత జ్ఞాపకాలను పంచుకున్న హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ

by సూర్య | Wed, Jan 07, 2026, 01:22 PM

ప్రముఖ హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ తన జీవితంలోని కొన్ని పాత జ్ఞాపకాలను, ముఖ్యంగా తన మొదటి ముద్దు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన 11 ఏళ్ల వయసులో సొంత ఊరిలోని చర్చి వెనుక తొలిసారిగా ఓ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నట్లు గుర్తుచేసుకున్నారు.ఆ సంఘటన గురించి క్లూనీ వివరిస్తూ, "నా సొంత ఊరైన కెంటకీలోని అగస్టా చర్చి వెనుక నా మొదటి ముద్దు జరిగింది. అప్పుడు నా వయసు 11 ఏళ్లు. బయట ఉన్న మా స్నేహితులంతా 'ఆమెను ముద్దు పెట్టుకో' అంటూ అరుస్తుంటే, వాళ్లకు కనపడకుండా మేమిద్దరం దాక్కున్నాం. అయితే, ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 11 ఏళ్ల వయసులో బంధాలు త్వరగానే ముగిసిపోతాయి కదా" అని నవ్వుతూ చెప్పారు.ఇదే ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఓ కఠిన పరిస్థితిని కూడా ఆయన పంచుకున్నారు. ఓ టీవీ షోలో నటిస్తున్నప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌తో వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత తన కెరీర్ ముగిసిపోయిందనే భయపడ్డానని తెలిపారు. "ఒక నిర్మాత నాతో అమర్యాదగా మాట్లాడితే నేను ఎదురుతిరిగాను. ఆ గొడవతో నేను ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాను. నన్ను తొలగించారో? లేక నేనే మానేశానో? ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే, కొన్ని సంవత్సరాల క్రితం నేను సహాయం చేసిన ఒక వ్యక్తి, ఈ విషయం తెలిసి నాకు ఒక పైలట్ ప్రాజెక్టులో ఆడిషన్ అవకాశం ఇచ్చాడు. దానివల్లే నా కెరీర్ నిలబడింది" అని క్లూనీ వివరించారు.

Latest News
 
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM
మహేష్-రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్: భారీ ప్రమోషన్ ప్లాన్ సిద్ధం Sun, Feb 08, 2026, 12:41 PM