1.11 లక్షల రూపాయలకు ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్ర మొదటి టికెట్‌ను దక్కించుకున్న అభిమాని

by సూర్య | Wed, Jan 07, 2026, 01:20 PM

చిరంజీవి తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటించారు. సినిమా విడుదలకు కొన్ని రోజులే ఉండటంతో ఇప్పటికే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. చాలా చోట్ల టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి.ఈ క్రమంలో, కోనసీమ జిల్లా అమలాపురంలోని వెంకటరమణ థియేటర్‌లో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. చిరంజీవి యువత అభిమాన సంఘం ఆధ్వర్యంలో ప్రీమియర్ షో మొదటి టికెట్ కోసం వేలం నిర్వహించారు. ఈ వేలంలో మెగా అభిమాని, జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బారావు పాల్గొని, ప్రీమియర్ షో మొదటి టికెట్‌ను ఏకంగా 1.11 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వచ్చిన మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు అందజేస్తామని అభిమాన సంఘం నాయకులు తెలిపారు. తనకు తొలి టికెట్ దక్కడంపై సుబ్బారావు సంతోషం వ్యక్తం చేశారు. 

Latest News
 
ఇమాన్వికి పవన్ కల్యాణ్ సినిమాలో ఆఫర్! Mon, Feb 09, 2026, 11:00 AM
The Raja Saab: ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మారుతి పై ట్రోల్… సోషల్ మీడియాలో వైరల్ టాపిక్! Sun, Feb 08, 2026, 11:41 PM
జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వైరల్.. Sun, Feb 08, 2026, 06:44 PM
ఈ నెల 11న OTTలోకి ‘అనగనగా ఒక రాజు’ సినిమా Sun, Feb 08, 2026, 06:32 PM
కన్నడ చిత్రసీమలోకి మీనాక్షి చౌదరి ఎంట్రీ? Sun, Feb 08, 2026, 12:43 PM